ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి సర్క్యులర్ వెలువడింది.
కేబినెట్ సమావేశం నేపథ్యంలో ఫిబ్రవరి 4 సాయంత్రంలోగా ప్రభుత్వ శాఖల అధికారులు తమ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం కోసం పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పంచాయతీల్లో ఈ గవర్నెన్స్ అమలు సహా పలు విషయాలపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దావోస్ లో జరిగిన సమావేశాల్లో మంత్రులు లోకేష్, టీజీ భరత్, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు బృందం నేటి అర్థరాత్రికి దిల్లీకి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం రాష్ట్రంలో అడుగుపెడతారు.