ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్స్ బౌన్సు కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మహేశ్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు వర్మకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఫిర్యాదుదారుడికి వెంటనే రూ.3.7 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఫిర్యాదుదారుడికి రూ.3.7 లక్షలు చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అమలు చేస్తామని కోర్టు వెల్లడించింది. 2018లో వర్మపై చెక్ బౌన్సు కేసు నమోదైంది. అప్పటి నుంచి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.