గగన్‌యాన్–1 మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్‌ను క్రూ మాడ్యూ ల్‌తో అనుసంధానించడంలో విజయం సాధించినట్లు తెలిపింది. అనుసంధాన ప్రక్రియ తర్వాత బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ నుంచి శ్రీహరికోటకు మాడ్యూల్‌ను తరలించారు.
మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లో సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఇస్రో తొలిసారిగా గగన్‌యాన్ పేరిట ప్రయోగాన్ని చేపట్టింది.
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో రూపొందించిన క్రూ మాడ్యూల్ సిస్టంను మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రపొల్షన్ సిస్టమ్స్ సెంటర్ లో ప్రొపల్షన్ సిస్టంతో అనుసంధానించారు.