దారుణం వెలుగు చూసింది. భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్‌లో ఉడికించి, ఎముకలను పొడిగా చేసి చెరువులో కలిపిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గురుమూర్తి అనే విశ్రాంత ఆర్మీ సైనికుడు గురుమూర్తి, భార్య మాధవిని చంపి, ముక్కలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదారబాద్ బాలాపూర్ మండలం జిల్లెలమూడి గ్రామంలోని వెంకటేశ్వర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భార్యకు ఎవరితోనే అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త గురుమూర్తి ఆమెపై కట్టెతో దాడి చేసి చంపేశాడు. తరవాత అనుమానం రాకుండా ముక్కలుగా చేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించాడు. ఎముకలను పొడిగా చేసి సమీపంలోని చెరువులో కలిపినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కొన్నా ఆధారాలు సేకరించారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన మాధవికి, పుట్టా గురుమూర్తితో 13 సంవత్సరాల కిందట వివాహమైంది.వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలను హైదరాబాద్ తీసుకెళ్లే విషయంలో జనవరి 16న భార్యాభర్తలు గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆవేశంలో కట్టెతో మాధవి తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయిందని గురుమూర్తి నుంచి పోలీసులు సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. తరవాత ఆమెను ముక్కలుగా చేయడం, కుక్కర్‌లో వేసి ఉడికించడం, ఎముకలు పొడి చేసి చెరువులో కలిపినట్లు విచారణలో తేలింది. శవాన్ని మాయం చేయడం ఎలా అనే వీడియోలు చూసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.