మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ
కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా జేడీయూ
బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీ ఎన్డీయే లో భాగస్వామిగా ఉంది.
జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు విరమించుకుంది.మణిపూర్ లో జేడీయూకి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.
మేఘాలయాలో పాలకపార్టీగా ఉన్న కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సైతం కొన్ని నెలల కిందటే మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకుంది. NPP మద్దతు ఉపసంహరించుకున్న కొన్ని నెలలకే నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీ కూడా అదేబాటలో నడించింది.
మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఐదుగురు జేడీయూ సభ్యులు బీజేపీలో చేరారు. మణిపూర్ శాసనసభలో 60 మంది సభ్యులుండగా బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ , మణిపూర్ లో మద్దతు ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.