హైదరాబాద్లో రెండోరోజూ సినీ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో మంగళవారం సోదాలు నిర్వహించి డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు నేడు దర్శకుడు సుకుమార్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘పుష్ప-2’ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ నివాసాల్లో నిన్నటి నుంచి రైడ్స్ జరుగుతున్నాయి. ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు చేస్తున్నారు.
నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా సంస్థ, సత్య రంగయ్య ఫైనాన్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసాలతో పాటు పలు ఫైనాన్స్ కంపెనీలలోనూ సోదాలు జరుపుతున్నారు.