కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.
మృతులు, క్షతగాత్రులు సావనూర్ నుంచి యల్లాపుర సంతకు పంటను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను హుబ్బలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తర కన్నడ జిల్లాలోని సావనూర్ – హుబ్బళి రహదారిపై అటవీ ప్రాంత పరిధిలో ప్రమాదం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. మరొక వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లిందని వివరించారు.