కర్ణాటక జిల్లాలో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెందిన ముగ్గురు వేద విద్యార్థులతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు.
కర్ణాటక హంపీ క్షేత్రంలోని నరహరి తీర్థుల ఆరాధన కోసం తుఫాను వాహనంలో విద్యార్థులు ప్రయాణిస్తుండగా సింధనూరు వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. మృతుల్లో డ్రైవర్ శివ, విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర, ఉన్నారు.
సమచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.