ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ,గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు వెల్లడించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నిర్ణీత తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా 81 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 1,48,881మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా 4,496మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.
మెయిన్స్ షెడ్యూల్ ..
మే3- తెలుగు(క్వాలిఫయింగ్ టెస్ట్)
మే4- ఇంగ్లిష్(క్వాలిఫయింగ్ టెస్ట్)
మే5- పేపర్-I(జనరల్ ఎస్సే)
మే6- పేపర్-II ( చరిత్ర, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్)
మే7- పేపర్-III (భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్)
మే8- పేపర్-IV (భారతదేశం, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి)
మే9- పేపర్-V (సైన్స్ అండ్ టెక్నాలజీ. పర్యావరణ సమస్యలు)