దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించిన బీజేపీ తాజాగా మరికొన్ని ఎన్నికల వాగ్దానాలను ప్రజల ముందు ఉంచింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హమీ ఇచ్చింది. అలాగే పాలిటెక్నిక్, ఐటీఐ చదివే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు భీమ్ రావ్ అంబేద్కర్ స్టైఫండ్ పథకం కింద ప్రతి నెలా రూ. 1,000 చొప్పున సాయం అందజేస్తామని పేర్కొంది.
యూపీఎస్సీ, స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి రూ. 15 వేల ఆర్థికసాయం అందజేస్తామని సంకల్ప్ పత్ర పార్ట్-2ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. ఆప్ హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలు, అవినీతిని తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సంకల్ప్ పత్ర పార్ట్-1ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇదివరుకే విడుదల చేశారు. గర్భిణీలకు రూ. 21 వేల ఆర్థికసాయం, మహిళలకు నెలకు రూ. 2,500 నగదు అందజేస్తామన్నారు.