గత వారం దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అయితే సైఫ్‌పై దాడి చేసులో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. సైఫ్‌పై కత్తితో దాడిచేసిన దుండగుడు మహమ్మద్ షరీపుల్ బంగ్లాదేశ్ గుండా మేఘాలయ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడి, విజయ్ దాసుగా పేరు మార్చుకున్నాడని పోలీసులు గుర్తించారు.
ముందుగా పశ్చిమబెంగాల్‌లోకి ప్రవేశించిన షరీపుల్ కొంత కాలం అక్కడే ఉండి, తరవాత ముంబైలో ఉద్యోగం కోసం వచ్చాడని పోలీసులు గుర్తించారు. బెంగాల్ వ్యక్తి ద్వారా భారత్‌లో సిమ్ కార్డు తీసుకుని ఫోన్ ఉపయోగిస్తున్నాడని తెలిపారు. పలు మార్లు బంగ్లాదేశ్‌కు కాల్స్ వెళ్లడాన్ని గుర్తించారు. ముంబైలో ఆధార్ కార్డు పుట్టించే ప్రయత్నం చేసినా ఫలించలేదని తేలింది.
డబ్బు కోసమే సైఫ్‌పై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. సైఫ్ అలీఖాన్ కుటుంబంపై ఎలాంటి ముందస్తు కుట్ర లేదని తేలింది. ఒకేసారి కోటి రూపాయలు కాజేసి, బంగ్లాదేశ్ పారిపోవాలని ప్రయత్నం చేసినట్లు విచారణలో వెలుగుచూసిందని పోలీసుల ద్వారా తెలిసింది.