ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివెళుతున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు దేశవిదేశాల నుంచి వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఫిబ్రవరి 10న మహాకుంభమేళాలో పాల్గొననున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈనెల 27న త్రివేణీ సంగమంలో గంగాపూజ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సైతం ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమ్మేళనాలలో మహా కుంభమేళా అనేది ఒకటి. ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది.