ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ మృతదేహంపై ఓ మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు బయటపడ్డాయి. పోస్టు మార్టం రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. కోల్‌కతా ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట కేసును విచారించిన బెంగాల్ పోలీసులు అనంతరం సీబీఐకి కేసును అప్పగించారు. ఫోరెన్సిక్ నివేదికలో బాధితురాలి మృతదేహంపై దోషి సంజయ్ రాయ్ డీఏన్‌ఏ ఆనవాళ్లు పూర్తిగా లభించాయని, ఓ మహిళకు చెందిన డీఎన్‌ఏ కూడా వెలుగుచూడటం చర్చకు దారితీసింది.
ఫోరెన్సిక్ ల్యాబ్ పరికరాలు పరీక్షలు నిర్వహించే ముందు సరైన రీతిలో స్టెరిలైజ్ చేయకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని అనుమానిస్తున్నారు. సరైన సదుపాయాలు లేని ల్యాబులో పరీక్షలు నిర్వహించడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. దీనిపై సీబీఐ కూడా ఆ మహిళ ఎవరు అనే దానిపై విచారణ చేపట్టలేదు.
దోషి సంజయ్ రాయ్‌కు ఉరి శిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కోల్‌కతాలోని సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. కేసు అరుదైన నేరం పరిధిలోకి రాదని సీల్దా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబిర్బన్ దాస్ తీర్పులో పేర్కొన్నారు.