ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. గరియాబంద్ ప్రాంతంలో డీఆర్జీ,ఎస్వోజీ దళాలు కూంబింగ్ నిర్వహిస్తోన్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు. 20 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 207 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ఎన్కౌంటర్ల్లో పాల్గొన్నాయి.
గడచిన ఆరు మాసాల కాలంలో ఛత్తీస్గఢ్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లలో 156 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2027 చివరినాటికి మావోయిస్టులు లేని దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన మేరకు బలగాలు నిత్యం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.