నటుడు విజయ్ రంగరాజు గుండెపోటుతో కన్నుమూశారు. గత వారం షూటింగులో గాయపడ్డ రంగరాజు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతలోనే గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. 1994లో భైరవ ద్వీపం చిత్రంలో విజయ్ రంగరాజుకు మంచి గుర్తింపు లభించింది. తమిళ సినిమాల్లోనూ విలన్‌గా, సహాయనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రంగరాజు అసలు పేరు ఉదయ రాజ్‌కుమార్.
వియత్నాం కాలనీ చిత్రంలో రంగరాజుగా అరంగేట్రం చేశారు. ఆ తరవాత రంగరాజు అనేక చిత్రాల్లో నటించారు. రంగరాజు పేరుతో అప్పటికే ఓ నటుడు ఉండటంతో విజయ్ రంగరాజుగా పేరుమార్చుకున్నారు. విజయ్ రంగరాజు ప్రముఖ నటులతో నటించారు. రజనీకాంత్‌తో విజయ్ రంగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి.
కొంత కాలం లండన్‌లో ఉద్యోగం చేసిన రంగరాజు మరలా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. తాను ఎంతో ఫిట్‌గా ఉన్నా రావాల్సినంత గుర్తింపు రాలేదని ఆవేదన చెందుతూ ఉండేవారు.