ప్రశాంతంగా సాగుతోన్న కుంభ మేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా జరిగే ప్రాంతం సెక్టార్ 19లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 18 గుడారాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. ప్రమాదం జరగిన వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. అక్కడే అందుబాటులో ఉన్న సీఎం ఆదిత్యనాథ్ దాస్ యోగి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై ప్రధాని మోదీ సీఎం యోగీకి ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు.త్వరలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ పవిత్ర స్నానాలకు రానున్నారని అధికారులు తెలిపారు.
మౌని అమావాస్యను పురస్కరించుకుని 8 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా వేశారు. ఇప్పటి వరకు 9 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. ప్రపంచంలో జరుగుతోన్న అతి పెద్ద వేడుక మహా కుంభమేళాలో కృత్రిమ మేథతో పనిచేసే సీసీటీవీలు, డ్రోన్లను వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు.