గ్రామీణ క్రీడ ఖోఖోలో భారత్ మరోసారి సత్తా చాటింది. ఖోఖో ప్రపంచకప్ -2025 పోటీల్లో భాగంగా మహిళల జట్టు చాంపియన్ గా నిలవగా , పురుషుల జట్టు కూడా విజేతగా నిలిచింది. దిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ లో ప్రత్యర్థి నేపాల్‌పై 54-36 తేడాతో విజయం సాధించి, ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇరు జట్లకు ప్రత్యర్థి నేపాల్ కావడం ఈ టోర్నీలో విశేషం.
ఖో ఖో ప్రపంచకప్-2025 టోర్నీ న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జనవరి 13 నుంచి 19 వరకు జరిగింది. నేడు జరిగిన ఫైనల్ లో భారత పురుషుల, మహిళల జట్లు, నేపాల్ పురుషుల, మహిళల జట్ల పై విజయం సాధించాయి. ఈ టోర్నీలో మొత్తం 39 జట్లు పాల్గొన్నాయి.