ఫైనల్ లో నేపాల్ పై ఘన విజయం
ఖోఖో వరల్డ్ కప్ -2025 టోర్నీలో భాగంగా మహిళల విభాగంలో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. దిల్లీ వేదికగా నేపాల్ అమ్మాయిలతో తలపడిన భారత యువతుల బృందం ఘన విజయం సాధించింది.
ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్, భారత్ ను అటాక్ రమ్మని ఆహ్వానించింది. దీంతో ప్రారంభం నుంచి అదరగొట్టిన భారత అమ్మాయిలు, నేపాల్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జగజ్జేతగా నిలిచారు.
టర్న్-1లో భారత్ దూకుడుగా ఆడి 34-0తో ఆధిక్యం సాధించారు. ఆ తర్వాత నేపాల్ పుంజుకోవడంతో 35-24తో రెండో టర్న్ స్కోర్ ఉంది. మూడో టర్న్‌లో భారత్ మళ్లీ దూకుడుకు కేరాఫ్ గా మారింది. ఆఖరికి ఖోఖో తొలి వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా భారత అమ్మాయిల జట్టు నిలిచింది.