భారత్ లో పర్యటిస్తున్న బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ ‘జై శ్రీరామ్ ’ నామస్మరణ చేయడంపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం సాయంత్రం బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్ యూ, ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్‌తో ఆకట్టుకున్నారు.
ప్రదర్శన ముగిసే సమయానికి క్రిస్ మార్టిన్ శ్రోతలుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ వ్యక్తి జైశ్రీరామ్ ఫ్లకార్డు ప్రదర్శించగా ఆయన కూడా ‘జై శ్రీరామ్’ నామస్మరణ చేశారు. ఆ పదానికి సంబంధించి అర్ధాన్ని అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు.
హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్, క్రిస్ మార్టిన్ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా, ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్‌నాథ్ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు.