దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోదంటూ రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గవహటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మోన్ జెట్ చాటియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్య్రాన్ని అతిక్రమించారని, ఆయన వ్యాఖ్యలు దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని చాటియా ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు వేర్పాటువాదులను, అశాంతి పరులను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చాటియా ఫిర్యాదు చేశారు.ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ విశ్వాసం ఉంచాలని దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాసేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు.
ఆర్.ఎస్.ఎస్ భావజాలం వేలసంవత్సరాల నాటిదని,బీజేపీ, దేశంపై పోరాటం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బయట పడిందని బీజేపీ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యానించారు.