తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చిన తొలి ఆదివారంతో ప్రారంభమైన ఈ జాతర ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగియనుంది.
జాతర సందర్భంగా మల్లన్న ఆలయంలో ప్రతీ ఆదివారం విశేష కార్యక్రమాలు ఉంటాయి. స్వామి, అమ్మవార్లకు బోనాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కు తీర్చుకుంటారు.
ఉత్సవాల్లో భాగంగా పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున నిర్వహించే పెద్ద పట్నం, అగ్నిగుండాల ఉత్సవాలు పురస్కరించుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 20న స్వామి వారి కళ్యాణ వేదిక వద్ద పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని హైదరాబాద్ కు చెందిన ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఉత్సవాల సందర్భంగా సిద్ధిపేట జిల్లా అధికారులు గట్టి బందోబస్సు ఏర్పాటు చేశారు.