నేపాల్ జట్లతో నేడే తుదిపోరు…
టైటిల్ కు అడుగుదూరంలో భారత జట్లు
ఖోఖో ప్రపంచకప్ -2025 పోటీల్లో భాగంగా భారత పురుషుల, మహిళల జట్లు సత్తా చాటాయి. ఇరు జట్లు ఫైనల్ కు దూసుకెళ్లాయి. సెమీఫైనల్లో భాగంగా శనివారం నాడు భారత అమ్మాయిల జట్టు 66-16తో దక్షిణాఫ్రికాను ఓడించింది. నాజియా, నిర్మలా భాటి, నస్రీన్ షేక్, వైష్ణవి, బిలార్‌దేవి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
నేడు జరిగే టైటిల్ సమరంలో నేపాల్‌తో భారత్ అమీతుమీ తలపడనుంది. సాయంత్రం ఆరు గంటలకు ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్‌లో నేపాల్ 89-18తో ఉగాండాను ఓడించి ఫైనల్ కు చేరింది.
పురుషుల విభాగంలోనూ సత్తా
పురుషుల విభాగంల భాగంగా జరిగిన సెమీస్ పోరులో భారత్ 60-42తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. తుదిపోరులో భాగంగా నేపాల్‌ను భారత్ ఢీకొట్టనుంది. సెమీస్ విభాగంలో నేపాల్ 72-20తో ఇరాన్‌పై విజయం సాధించింది.
సాయంత్రం జరిగే ఫైనల్ మ్యాచ్ లతో ఈ ప్రపంచకప్ పోటీకి తెరపడనుంది.