బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.దాడి తరవాత నిందితుడు ముంబైలోని వర్లీ రైల్వే స్టేషన్లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్ వెళ్లే రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి బిహార్ పారిపోయేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైందని ముంబై పోలీస్ డిప్యూటీ కమిషనర్ దీక్షిత్ వెల్లడించారు.
సైఫ్‌పై దాడికి దిగిన వ్యక్తి భారతీయుడు కాదని ముంబై పోలీసులు ప్రకటించారు. అతని వద్ద భారతీయుడు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదని, బంగ్లాదేశ్‌కు చెందిన కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే బంగ్లాదేశీయుడు భారత్ వచ్చి బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.దాడి తరవాత బిహార్ అక్కడ నుంచి బంగ్లాదేశ్ పారిపోయే ప్రయత్నం చేయగా ముందే అదుపులోకి తీసుకున్నట్లు ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడమ్ వెల్లడించారు. నిందితుడిపై పాస్ పోర్ట్ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దొంగతనం ప్రయత్నం చేయగా పనిమనిషి గుర్తించి కేకలు వేయడంతో దొంగ కత్తి తీసి బెదిరించినట్లు విచారణలో వెల్లడైందని ముంబై పోలీసులు చెబుతున్నారు. తనకు కోటి రూపాయలు ఇవ్వాలంటూ కత్తితో బెదిరించాడని సైఫ్ ఇంటి పనిమనిషి జు వెల్లడించారు. ఇంట్లో అందరూ నిద్రలేవడంతో దుండగుడు ఫైర్ సేఫ్టీ మెట్ల నుంచి పారిపోయాడని చెబుతున్నారు.