వైసీపీ మాజీ ఎంపీ వైసీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డిపై హైదరాబాద్‌లోని కొండాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొండాపూర్‌లోని ఓ స్థలం కబ్జా చేశారంటూ ఎ.అనిల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కొండాపూర్‌లో 2006లో తాము కొనుగోలు చేసిన స్థలంలో ఇటీవల కొందరు బోర్డులు ఏర్పాటు చేసుకుని కబ్జా చేశారంటూ వైసీపీ మాజీ ఎంపీ స్వర్ణలతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమి తమదేనంటూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి తరపున స్థల వాచ్‌మన్ పోలీసులకు వైవీ దంపతులపై ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
2006లో లక్షయ్య అనే రైతు నుంచి తాము భూమి కొనుగోలు చేశామని, తరవాత దాన్ని ఎల్ అండ్ టీ కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు స్వర్ణలతారెడ్డి చెప్పారు. 2022లో ఎల్ అండ్ టీ కంపెనీ భూమిని ఖాళీ చేసింది. ఆ తరవాత రాజకీయ పలుకుబడి కలిగిన అనిల్‌రెడ్డి కబ్జా చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల తాజాగా నర్సింహారెడ్డి పేరుతో స్థలంలో బోర్డులు ఏర్పాటు చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.