గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుందని మాద్రాస్ ఐఐటి మాజీ డైరెక్టర్ కామకోటి వ్యాఖ్యానించారు. ఇటీవల చెన్నైలోని వెస్ట్ మాంబళంలోని గోశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇందుకు ఆయన ఓ అనుభవం చెప్పారు. తన తండ్రికి ఓ సారి జ్వరం వచ్చిందని ఓ సన్యాసికి చెప్పగా గోమూత్రం తాగితే తగ్గుతుందని వారు సలహా ఇచ్చారట. వెంటనే కామకోటి తండ్రి గో మూత్రం సేవించారని జర్వం పావుగంటలో మాయమైందని ఆయన గుర్తు చేసుకున్నారు.
గో మూత్రంలో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయని కామకోటి అభిప్రాయపడ్డారు. కామకోటి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో పెద్ద దుమారం మొదలైంది. గో మూత్రంతో జ్వరం తగ్గుతుందంటూ కామకోటి చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై కామకోటి స్పందించాల్సి ఉంది.