ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ, జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయి వేదికగా జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాల జట్లు తలపడనున్నాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో జట్టు కూర్పు గురించి వివరించారు.జట్టులో మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ ఇదే జట్టు కొనసాగుతుందని స్పష్టం చేశఆరు. . ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్,న్యూజీలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, పాకిస్తాన్ తో
ఫిబ్రవరి 23న, న్యూజీలాండ్ తో మార్చి 2 న భారత్ ఆడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయి.
జట్టు వివరాలు…
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్