ఆంధ్రప్రదేశ్ ను కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు నదుల అనుసంధానం ఏకైక మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులు అర్పించారు.
గోదావరి-పెన్నా, పోలవరం – బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే గేమ్ ఛేంజర్ గా తయారవుతుందని చంద్రబాబు అన్నారు. బనకచర్ల వరకు నీళ్లు వస్తాయని తాను కూడా రాయలసీమలోనే పుట్టానని, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
కడపలోని కొప్పర్తిని పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
ప్రపంచంలో పది టూరిస్టు ప్లేస్‌లోవ ఒకటైన గండికోటను అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి , అనుక్షణం తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.