సర్వే ఆప్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజైడ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం కింద ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి 65 లక్షల కుటుంబాలకు ఆస్తికార్డులు పంపిణీ చేశారు. పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 250 జిల్లాల 65 లక్షల కుటుంబాల వారు ఆస్తి కార్డులు అందుకున్నారు.
స్వామిత్వ పథకం ద్వారా ప్రజల ఆస్తులను రీసర్వే చేసి కార్డులు అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. 50 వేల గ్రామాలకు చెందిన 65 లక్షల కుటుంబాలకు నేడు ప్రధాని మోదీ కార్డులు అందించారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐదేళ్ల కిందట మొదలైన స్వామిత్వ పథకం ద్వారా ఇప్పటి వరకు కోటిన్నర మందికి ఆస్తికార్డులు పంపిణీ చేశారు. ఇవాళ మరో 65 లక్షల మందికి ఆస్తి కార్డులు అందించారు. మొత్తం 2.25 కోట్ల కుటుంబాలకు ఆస్తి కార్డులు అందించడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.