అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతోన్న డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని ప్రోత్సహిస్తామంటూ ప్రకటన చేయడంతో బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటిపోయింది. రెండేళ్ల కిందట ఒక బిట్ కాయిన్ 20 వేల అమెరికా డాలర్లు దాటి రికార్డు నమోదు చేయగా… తాజాగా అది లక్ష డాలర్లు అంటే రూ.86 లక్షలు దాటిపోయింది. ట్రంప్ తాజాగా చేసి వ్యాఖ్యలతో మరలా క్రిప్టో కరెన్సీల విలువలు దూసుకుపోతున్నాయి. అమెరికాను క్రిప్టో కరెన్సీ రాజధానిగా చేస్తామని ట్రంప్ చేసిన ప్రకటనలు క్రిప్టో కరెన్సీలు దూసుకెళ్లడానికి దోహదపడింది.
2009లో మొదలైన బిట్ కాయిన్ అనేక అవాంతరాలు దాటుకుని నేడు లక్ష డాలర్లకు చేరింది. ఎవరి నియంత్రణలోలేని బిట్ కాయిన్ వ్యవస్థను అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడు తయారు చేశాడు. దాని తరవాత అనేక క్రిప్టో కరెన్సీలు మార్కెట్లోకి వచ్చినా బిట్ కాయిన్ విలువను ఏ మాత్రం దాటలేకపోయాయి. రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీని పెద్ద ఎత్తున అమెరికా ప్రోత్సహించనుంది అనే వార్తలు మార్కెట్లలో జోష్ నింపింది.