జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలపై పార్లమెంట్ మంత్రిత్వ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత సమావేశాలు నిర్వహిస్తారు. తరవాత మార్చి 9 వరకు వాయిదా వేయనున్నారు. స్థాయీ సంఘాలు వివిధ పద్దులు అధ్యయనం చేసేందుకు ఈ సమయం ఇస్తారు.
మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. పూర్తి స్థాయి సమావేశాల్లో వివిధ పద్దులకు ఆమోదం తెలపనున్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తరవాత ఇది రెండో బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలకు సెలవు ప్రకటించారు.