చెస్ ప్లేయర్ గుకేశ్ కు భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.గుకేశ్ చెస్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. దేశానికి పలు మెడల్స్ అందించారు. సింగపూర్ వేదికగా 2024లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించాడు.అంతకు ముందు బుడాపెస్ట్ టోర్నీలో కూడా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఓపెన్, వ్యక్తిగత విభాగాల్లో రాణించి అరుదైన ఘనత సాధించాడు. గుకేశ్ దేశం తరఫున సాధించిన విజయాలను గౌరవిస్తూ కేంద్రం ఆయనను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో గౌరవించింది. ఈ పురస్కారాన్ని నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.
హాకీ స్టార్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటింగ్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ లను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఖేల్ రత్న అవార్డులతో సత్కరించారు.
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై షూటర్ మనూ భాకర్ స్పందించారు. తనకు దక్కిన గౌరవం దేశం గర్వించేలా మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన జివాంజీ దీప్తి (పారా అథ్లెటిక్స్), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్) పురస్కారాలు అందుకున్నారు. వీరితో పాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు.
లైఫ్‌టైం కేటగిరీలో మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్)
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించారు.