బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన కేసులో ఓ అనుమానితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడిని తీవ్రంగా పరిగణిచిన ముంబై పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించారు.దాడి తరవాత బాంద్రా రైల్వే స్టేషన్లో అనుమానితుడు లోకల్ ట్రైన్ ఎక్కినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడనే విషయంలో సీసీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అనుమానితుడిని అరెస్ట్ చేసి బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమానితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ముంబైలోని లీలావతి ఆసుపత్రి సీటీవో ప్రకటించారు. దాడి తరవాత సైఫ్‌కు కీలక ఆపరేషన్లు పూర్తి చేశారు. వెన్నెముక ప్రాంతంలో కత్తి ముక్కను వెలికి తీశారు. మొత్తం ఆరు చోట్ల కత్తి గాయాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రాణాపాయం లేదని ప్రకటించారు. సైఫ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు బులెటన్ విడుదల చేస్తున్నారు.