ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం గేమ్ ఛేంజర్‌ను లోకల్ ఛానల్‌లో ప్రసారం చేసిన ఇద్దరు నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పైరసీ సీడీ ద్వారా గేమ్ ఛేంజర్ సినిమాను విశాఖ నుంచి ప్రసారం చేసినట్లు నిర్మాణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలోనూ గేమ్ ఛేంజర్ సినిమా ప్రసారంపై వీడియోలు వచ్చాయి. దీనిపై విచారించిన పోలీసులు విశాఖ కేంద్రంగా పనిచేస్తోన్న లోక్ ఛానల్ ఆపరేటర్లను అరెస్ట్ చేశారు.
వందల కోట్ల వ్యయంతో నిర్మించిన చిత్రాలను పైరసీ చేసి లోకల్ ఛానల్‌లో ప్రసారం చేయడంపై కేసు నమోదైంది. వేలాది మంది శ్రమపడి తీసిన చిత్రాలు అక్రమంగా ప్రసారాలు చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.