చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. టిప్పర్ ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున చిత్తూరు శివారు గంగాసాగరం పరిధిలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
తిరుపతి నుంచి మధురై వెళ్లే ప్రైవేటు బస్సు గంగాసాగరం వద్ద అదుపుతప్పింది. పక్కనే ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కరెంటు స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. కరంట్ స్తంభం బస్సులోకి చొచ్చుకురావడంతో నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వేలూరు, నరివి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్ , బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.