బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. 2025 ఏడాదికి గానూ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎగ్జామ్ క్యాలెండర్ను ఐబీపీఎస్ విడుదల చేసింది.
క్యాలెండర్ ద్వారా ఆయా బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్లు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్మెంట్ ట్రెయినీలు, స్పెషలిస్ట్ ఆఫీసర్లు, వినియోగదారుల సేవా సహాయకుల వంటి పోస్టుల భర్తీని చేపట్టనున్నారు.
ఆఫీసర్ స్కేల్ 1 స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసేవారికి ఈ ఏడాది జులై 27న, ఆగస్టు 2, 3 న ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తారు. మొయిన్స్ పరీక్ష నవంబరు 13న జరుగుతుంది.
ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులకు సంబంధించిన పరీక్షలను ఐబీపీఎస్ విడుదల చేయలేదు. నవంబరు 13న మెయిన్స్ ఉంటుంది.
కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి డిసెంబరు 6,7, 13, 14 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష 2026 ఫిబ్రవరి 1న ఉంటుందని ఐబీపీఎస్ తెలిపింది.