వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే NEET-UG పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్-పేపర్ అంటే OMR పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశమంతా ఒకే రోజు ఒకే వేళలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం మేరకు నీట్ యూజీ పరీక్ష ను పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారి వెల్లడించారు.
దేశంలో అత్యధిక మంది ఈ పరీక్ష రాస్తారు. 2024లో 24లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్ విధానం నీట్ నిర్వహించాలని సిఫారసు చేసింది. కేంద్ర మాత్రం పెన్- పేపర్ పద్ధతికి మొగ్గుచూపింది.