ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.దక్షిణ బస్తర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల ఘటనలో 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. పూర్తి సమాచారం అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.
బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారీ కాంకేర్, మారేడుబాక ప్రాంత అడవుల్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ గా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారనే సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఉదయం 9 గంటల నుంచి బస్తర్ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఇదే జిల్లాలో ఈ నెల 12న జరిగిన ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నెల 4న కూడా బస్తర్‌లో ఎన్‌కౌంటర్ జరగగా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ నెల 6న మావోయిస్టుల కోసం గాలిస్తున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ ఘటనలో 8 మంది జవాన్‌లతో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.