ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పాకాల బీచ్లో విషాదం చోటు చేసుకుంది.
సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు పర్యాటకులు గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు మెరైన్ పోలీసులు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వారిలో పొన్నలూరు మండలం శివన్నపాలెం గ్రామానికి చెందిన జెస్సిక, నోసిన, మాధవ, కొల్లగుంటకు చెందిన యామినిగా గుర్తించారు.
గల్లంతైన మరో ఇద్దరి కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. సముద్రంలో అలలు తీవ్రంగా ఉండటంతో కొట్టుకుపోయినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు తరచూ హెచ్చరికలు జారీ చేస్తూన్నా.. ఆ ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడచిన నాలుగేళ్లలో 58 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు.