కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిదో వేతన సంఘం అమలుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రిమండలి, త్వరలోనే ఎనిమిదో వేతన సంఘం కమిషన్ చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించాలని నిర్ణయించింది.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలో మూడో లాంచ్‌ప్యాడ్‌ను నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడో లాంచ్‌ప్యాడ్ ద్వారా నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికిల్స్(ఎన్జీఎల్వీ)ను ప్రయోగించనున్నారు. నాలుగేళ్లలో లాంచ్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం సుమారు రూ. 3985 కోట్ల ఖర్చు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
వచ్చే నెలలో కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.