కేరళ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు జీవ సమాధి అయిన గోపన్ స్వామి మృతదేహాన్ని తిరువనంతపురంలోని ఓ దేవాలయం వద్ద వెలికి తీశారు. తన తండ్రి సజీవ సమాధి అయ్యాడంటూ గోపన్ స్వామి కుమారులు సనందన్, రాజేశన్ ఇటీవల పోస్టర్లు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి కోరిక మేరకు ఎవరికీ తెలియకుండా దేవాలయం వద్ద సజీవ సమాధి చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
మొదట మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లగా గోపన్ స్వామి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో బలగాలతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇవాళ గోపన్ స్వామి మృతదేహం వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గోపన్ స్వామిని ఆయన కుమారులు ఇటీవల సజీవ సమాధి చేశారు. ఈ విషయాన్ని వారు గ్రామంలో పోస్టర్లు వేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హైకోర్టు జోక్యంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆలియాస్ మణ్యన్