పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జ్యోతిప్రియా మాలిక్‌కు కోల్‌కతాలో మనీల్యాండరింగ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ప్రజాపంపిణీ పథకంలో భాగంగా జరిగిన స్కామ్ విచారణలో భాగంగా అరెస్టైన మాలిక్ 14 నెలలుగా జైలులో ఉన్నారు.
మాలిక్ బెయిల్ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరి నుంచి సాక్షి సంతకాలు తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని మాలిక్‌కు కోర్టు సూచించింది. పాస్‌పోర్టును సరెండర్ చేయాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయరాదు అని పీఎంఎల్ఏ కోర్టు హెచ్చరించింది.
మాలిక్‌ను 2023 అక్టోబర్ 27వ న ఈడీ అరెస్టు చేసింది. రేషన్ షాపులకు పంపిన ఆహారధాన్యాలను అక్రమంగా మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో 2023, డిసెంబర్ 12 మాలిక్‌పై ఛార్జిషీట్ దాఖలైంది. బెంగాల్ లో ఆహార, సరఫరాల శాఖకు 2011 నుంచి 2021 మధ్య మాలిక్ మంత్రిగా చేశారు.