కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.జనవరి 18న శనివారం రాత్రి దిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. అనంతరం రాత్రికి హోటల్ లో బస చేస్తారు. 19వ తేదీ ఉదయం కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారు.