మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు జాహిద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అతను రాహుల్ సింగ్ అనే పేరుతో హిందూ యువతులను మోసగిస్తున్నాడన్నది వారు చేసిన ఆరోపణ. ఇండోర్‌లొని ఒక కెఫేలో ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. దాంతో పోలీసులు జాహిద్ ఖాన్‌ను అరెస్ట్ చేసారు.
రాజ్‌కుమార్ తేత్వాల్, మాన్‌సింగ్ రాజావత్ హిందూ జాగరణ్ మంచ్ ఇండోర్ జిల్లా సమన్వయకర్తలు. నగరంలోని మాలవీయ నగర్‌లో యాంగర్ స్ట్రైక్ కెఫేలో ఒక వ్యక్తి ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వారికి సమాచారం అందింది. దాంతో వెంటనే వారు అక్కడకు వెళ్ళి అతన్ని ప్రశ్నించారు. అతను మొదట తనపేరు రాహుల్ సింగ్ అని చెప్పాడు. కానీ అనుమానంతో నిలదీయగా తన అసలు పేరు జాహిద్ ఖాన్ అని వెల్లడించాడు.
కెఫేలో అమ్మాయి గురించి అడిగినప్పుడు జాహిద్ ఖాన్ తాను ఆ అమ్మాయితో 8 నెలల నుంచీ బంధంలో ఉన్నానని వెల్లడించాడు. ఆమెను పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నాననీ చెప్పాడు. జాగరణ్ మంచ్ కార్యకర్తలు అతని ఫోన్‌ను పరిశీలించి అవాక్కయ్యారు. అతని ఫోన్‌లో చాలామంది అమ్మాయిల అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అతని గురించి మరింత వాకబు చేయగా, అతనికి రాహుల్ శర్మ అనే దొంగపేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ ఉందనీ, దానితో అతను అమ్మాయిలను ఆకర్షించి వలలో పడేసుకుంటాడనీ వెల్లడైంది. జాహిద్ ఖాన్ దగ్గర నకిలీ ఆధార్ కార్డు కూడా ఉంది. ‘వేదిక్ శర్మ’ అనే హిందూ బ్రాహ్మణ పేరుతో ఉన్న ఆ ఆధార్ కార్డుతో హోటల్ రూమ్స్ బుక్ చేస్తాడని తెలిసింది. అలా హిందువులా నటిస్తూ హిందూ అమ్మాయిలను ఆకర్షించి ప్రేమ పేరుతో వారి జీవితాలు నాశనం చేస్తుంటాడని వెల్లడైంది.
హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు జాహిద్ ఖాన్‌ను తదుపరి దర్యాప్తు, చట్టబద్ధమైన ప్రొసీడింగ్స్ కోసం పోలీసులకు అప్పగించారు. పోలీసులు జాహిద్ ఖాన్ కార్యకలాపాల గురించి, అతను ఎంతమంది అమ్మాయిలను మోసం చేసాడన్న వివరాల గురించి దర్యాప్తు చేస్తున్నారు.