బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలో తన నివాసంలో అర్థరాత్రి ఈ దాడి చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. దొంగను గమనించిన సైఫ్ అలీఖాన్ పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఆరు సార్లు కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. రెండు పోట్లు తీవ్రంగా ఉన్నాయని ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటన్ విడుదల చేస్తామని, అసత్యాలు ప్రచారం చేయవద్దని ఆయన మేనేజర్ మీడియాను కోరారు.
సైల్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్ర గాయాలున్నా ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ నివసించే అపార్టుమెంటులోకి దొంగ ఎలా ప్రవేశించడనే విషయంలో పలు అనుమానాలు వస్తున్నాయి. దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు నాలుగు టీంలు ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.