ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివేణీ సంగమం దగ్గర పవిత్ర స్నానాలు ఆచరించే ఈ పర్వం హిందువులకు పరమ పవిత్రమైనది. అక్కడ ఒక ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో తిరుగుతుండగా పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూపీ గజియాబాద్‌లోని దశ్నా మందిరంలో ప్రధాన పూజారి, జునా అఖాడా మహామండలేశ్వర్ అయిన మహంత్ యతి నరసింగానంద్ కుంభమేళా వద్ద క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆ క్యాంప్ దగ్గర ఆయుష్ అనే వ్యక్తి సంచరిస్తున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో నిలదీసి ప్రశ్నించగా అతని అసలు పేరు ఆయుష్ అని, అతను హిందువు కాదు, ముస్లిం అనీ తేలింది. అయితే దొంగపేరుతో ఎందుకు కుంభమేళా క్యాంప్ దగ్గర తిరుగుతున్నాడు అన్న విషయం తెలుసుకోవలసి ఉంది. అందుకే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మకర సంక్రాంతి రోజు క్యాంప్ దగ్గర అయూబ్ అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. క్యాంప్‌కు సంబంధించిన సాధువులు అతన్ని ప్రశ్నించారు. దానికి అతను తన పేరు ఆయుష్ అనీ, సంత్ నరసింగానంద్‌ను కలవాలనీ చెప్పాడు. అయితే మరిన్ని ప్రశ్నలు వేసినప్పుడు అతని ప్రవర్తన సందేహాస్పదంగా అనిపించింది. దాంతో సాధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అతన్ని విచారించినప్పుడు అతని పేరు అయూబ్ అలీ అనీ, అతను ముస్లిం అనీ తేలింది.
అయూబ్ అలీ యూపీలోని ఎటా జిల్లా అలీగంజ్‌కు చెందిన వాడు. అతని తండ్రి పేరు సాకిర్ అలీ, అతనికి ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. అతను కుంభమేళాకు తాను ఒక్కడినే వచ్చాననీ, తనను ఎవరూ పంపించలేదనీ చెప్పాడు. కుంభమేళాకు రాకూడదన్న సంగతి తనకు తెలీదన్నాడు. అయూబ్ అలీగంజ్ నుంచి కాన్పూర్, అక్కణ్ణుంచి రైలుమార్గంలో గోరఖ్‌పూర్, అక్కడినుంచి ప్రయాగరాజ్ చేరుకున్నాడు.
అయూబ్ పట్టుబడిన సంఘటన తర్వాత మహంత్ యతి నరసింగానంద్ తన అనుమానాలు వెల్లడించారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్ని ఉండవచ్చని అనుమానించారు. ‘‘కొన్ని నెలల క్రితం గజియాబాద్‌లో మా దశ్నా మందిరం దగ్గర సుమారు 10వేల మంది ముస్లిములు మూకదాడికి పాల్పడ్డారు. నామీద నిరంతరాయంగా నిఘా పెట్టారు. బెంగళూరుకు చెందిన జుబేర్ అనే వ్యక్తి నన్ను చంపుతానని చాలాసార్లు బెదిరించాడు. గుడి మీద దాడి కూడా అతను చేయించినదే’’ అని చెప్పారు. ఆ నేపథ్యంలో స్వామి నరసింగానందకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు సెక్యూరిటీ గన్‌మెన్‌ను ఏర్పాటు చేసింది.
నరసింగానంద ఆశ్రమం దగ్గరలో, ఆయన పనిచేసే ఆలయం చేరువలో ముస్లిములు హిందూ పేర్లతో దొరకడం ఇదే మొదటిసారి కాదు. 2024 అక్టోబర్ 3న దశ్నా మందిరం దగ్గర ముగ్గురు ముస్లిములు హిందూ పేర్లతో దొరికారు. వారు రామ్‌లీల బృందంలో సభ్యులమని చెప్పుకుంటూ గుడి దగ్గరకు వెళ్ళారు. 2023 మే నెలలో మొహిసిన్ అనే వ్యక్తి ఇద్దరు మైనర్ బాలికలతో దశ్నా మందిరం దగ్గర పట్టుబడ్డాడు. ఆ ఇద్దరిలో ఒకమ్మాయి హిందువు. ఆమె ఆధార్ కార్డు చూపించి గుడిలోకి వారు చొరబడ్డారు. వాళ్ళు నరసింగానంద హత్యకు రెక్కీ చేయడానికి వచ్చారని అంచనా వేసారు. 2021 అక్టోబర్‌లో అనాస్ అనే ముస్లిం పిల్లవాడు గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. ఆ పిల్లవాణ్ణి నరసింగానంద స్వయంగా పోలీసులకు పట్టించారు. 2021 జూన్‌లో ఇద్దరు వ్యక్తులు నరసింగానంద హత్యకు ప్రణాళికలు రచిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అంతకుముందు 2021 మార్చ్‌లో ఆసిఫ్ అనే వ్యక్తి గుడి ఆవరణలోకి ప్రవేశించి పట్టుబడ్డాడు. అక్కడి అర్చకులతో గొడవ పెట్టుకున్నాడు. అతని గురించి వెతికినప్పుడు, నరసింగానందను హతమారుస్తానంటూ ఆసిఫ్ చేసిన పలు వీడియోలు ఆన్‌లైన్‌లో లభించాయి. అలా నరసింగానందను తుదముట్టించడానికి ముస్లిములు ఎన్నోసార్లు ప్రణాళికలు రచించారు.
ఇప్పుడు అయూబ్ కూడా నరసింగానందను హత్య చేయడానికే వచ్చాడా? అతని వెనుక ఏవైనా గ్రూపులు లేక ఎవరైనా వ్యక్తులు పనిచేస్తున్నారా అన్న విషయాలు తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.