మూడు మ్యాచ్ల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మహిళల క్రికెట్ పోటీలో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. నేడు రాజ్కోట్ వేదికగా జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్ పై భారత్ 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.భారత్ విధించిన 436 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ విఫలమైంది. ఐర్లాండ్ 31.4 ఓవర్లు ఆడి 131 పరుగులు మాత్రమే చేయగల్గింది.
ఓపెనర్ సారా ఫోర్బ్స్ (41) మాత్రమే టాప్ స్కోరర్ గా ఉన్నారు. మరో ఓపెనర్ గాబీ లూయిస్ (1) విఫలమైంది. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన కౌల్టర్ రిలే డకౌట్ కాగా, ఓర్లా (36) పరుగులతో రెండో అత్యధిక స్కోరర్ గా ఉన్నారు. లారా (10), లేహ్ (15), ఆర్లీన్ కెల్లీ (2), అవా (2), జార్జియానా (0), ఫ్రియా (1) విఫలమయ్యారు. అలానా (5*) నాటౌట్ గా నిలిచారు.
భారత బౌలర్లలో దీప్తి మూడు వికెట్లు తీయగా , తనూజా రెండు, సయాలీ , సాధు , మిన్నుయ తలా ఒక వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ , 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 435 పరుగులు చేసింది. ప్రతికా రావల్ (154), స్మృతీ మంధాన (135) శతకాలు చేశారు.