కేరళలోని శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్పస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ భగవంతుడైన అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి అయిన కారణం చేత పదేళ్ళ నుంచి యాభయ్యేళ్ళ వయో పరిమితిలో ఉండే స్త్రీలకు ఆ ఆలయ ప్రవేశం నిషేధం. హిందువుల ఆ విశ్వాసాన్ని అవహేళన చేస్తూ ఐదేళ్ళ క్రితం కమ్యూనిస్టు ప్రభుత్వం ఋతుమతులుగా ఉన్న ఇద్దరు కమ్యూనిస్టు మహిళలను ఆలయంలోకి ప్రవేశపెట్టింది. కొన్ని నిజాలు తెలుసుకుని, కొన్ని ప్రశ్నలు వేసుకుంటే ఆ సంఘటనలో దాగివున్న కుట్రను సరళంగా అర్ధమవుతుంది.
1. సుమారు రాత్రి ఒంటిగంటకు కు ఇద్దరు స్త్రీలను మఫ్టీలో ఉన్న పోలీసుల రక్షణలో ఆంబులెన్సులో తరలించారు. సామాన్యంగా అంబులెన్సులను ఎవరూ ఆపరనేది అందరికీ తెలిసినదే. దానిని కమ్యూనిస్టు నీచులు తమ కుయుక్తికి ఆయుధంగా వాడుకున్నారు.
2. అయినా, హిందూ కార్యకర్తలు ఆంబులెన్సును పంబ వద్ద, మరక్కోటం వద్ద రెండుసార్లు ఆపారు. హిందూ భక్తులు అడిగినప్పుడు ఆ స్త్రీలు తమను తాము “హిజ్రాలు”గా (Trangenders) పరిచయం చేసుకున్నారు. ఎందుకంటే సన్నిధానంలో హిజ్రాల ప్రవేశం మీద నిర్బంధాలేమీ లేవు. అలా వారు కొండ పైకి చేరగలిగారు.
3. సన్నిధానానికి చేరాక ఆ స్త్రీలనిద్దరినీ పోలీసులు ఆలయం వెనుకనున్న వీఐపీ ప్రవేశద్వారం వద్దకు చేర్చారు. సాధారణ ప్రవేశద్వారం వద్దనైతే భక్తులు ఆపే అవకాశముంటుంది. వీఐపీ ప్రవేశద్వారం దగ్గర వారిని ఆపే అవకాశాలు తక్కువ.
4. ఈ కుట్ర అంతా రాత్రి ఒంటిగంట నుంచి 3 గంటల మధ్యలో జరిగింది. ఆ సమయంలో గుడి మూసేసి ఉంది. భక్తులు నిద్రావస్థలో ప్రమత్తతతో ఉన్నారు. గుడి తెరవగానే మఫ్టీ పోలీసులు హిజ్రాలుగా చెప్పుకుంటున్న ఆ స్త్రీలను గర్భగుడి దగ్గరకు చేర్చి తాము తప్పుకున్నారు. ఆ హిజ్రా స్త్రీలు గర్భగుడిలో ప్రవేశించి కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషం మాత్రమే ఉన్నారు. అదీ దైవదర్శనం కోసం, భగవంతుడికి వందనం చేయడం కోసం కాదు. అయ్యప్ప సన్నిధిలోకి తాము ప్రవేశించినట్లు ఋజువు చేసుకోవడానికి సాక్ష్యం కోసం సెల్ఫీలు తీసుకోవడానికి మాత్రమే.
5. ఆ స్త్రీలు గర్భగుడి నుండి బైటకు రాగానే పోలీసులు “గుర్ఖా” అని కేకపెట్టారు. గుర్ఖా అనేది పోలీసువాహనానికి రహస్య సంకేతం. గుడి వెనుక దాచి ఉంచిన “గుర్ఖా” రాగానే పోలీసులు ఆ హిజ్రా మహిళలను ముందు పంబకు, తర్వాత శబరిమలకు దూరంగా తరలించి సురక్షిత ప్రదేశంలో దాచిపెట్టారు.
6. అంతా చేసి ఆలయప్రవేశం చేసామని చెప్పుకున్న స్త్రీలు ఇద్దరిలో ఒకరు CPI(ML), మరొకరు CPM పార్టీలకు చెందిన వారు. తమకు మతం లేదు, తాము నాస్తికులము అని చెప్పుకునే కమ్యూనిస్టులకు అయ్యప్ప మీద ఆకస్మికంగా భక్తి పెరిగిందా? లేక హిందూ ఆచారాలను, మతాన్ని అవమానించాలన్న దుర్బుద్ధా? అని ఆలోచిస్తే అసలు విషయం ఇట్టే అర్ధమైపోతుంది.
7. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అసమంజసమైనది. ఇతర మతాల విషయాలలో పొరపాటున కూడా వేలు పెట్టని న్యాయవ్యవస్థ, శబరిమల విషయంలో ఇచ్చిన అన్యాయమైన తీర్పులో ఏమని చెప్పింది? హిందూ భక్తురాండ్రకు ప్రవేశం కలిగించమన్నదా? లేక హిందూ మతాన్ని గౌరవించని విదేశీ మతస్తులకూ, నాస్తికులకూ యధేచ్చగా హిందూ మతాచారాలతో ఆడుకోవచ్చని చెప్పిందా?
8. తాము సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నామని చెప్పుకున్న మూర్ఖిస్టు ప్రభుత్వం నిజానికి చేయవలసింది ఏమిటి? తమ వద్దకు వచ్చిన హిందూ స్త్రీలకు ప్రవేశానికి అడ్డంకులుంటే తప్పించి ప్రవేశావకాశం కల్పించాలి కదా? అంతే తప్ప సెక్యులరిజం పేరుతో హిందూమతాన్ని బహిరంగంగా దూషించే విదేశీ మతాల తొత్తులతో, విదేశీ మతాలకు దాసులైన ఉన్మాదులతో హిందూ మతాన్ని అవహేళన చేయించవచ్చునా?
9. శబరిమల తీర్పుకు వ్యతిరేకంగా లక్షలాది హిందువులు అయ్యప్పజ్యోతితో నిరసన చేపట్టారు. దానికి పోటీగా కమ్యూనిస్టు ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ అనుయాయులతో పోటీ కోలాటం ఆడించడం ఏ రకమైన సెక్యులరిజం?
10. అసలు హిందూమతాన్నే నమ్మని క్రైస్తవ, ముస్లిం, నాస్తిక తండాలకు చెందిన స్త్రీలు మాత్రమే ఎందుకు శబరిమలకు ఎగబడ్డారు? భక్తితోనా లేక హిందూమతాన్ని అవహేళన చేయడానికా? ఆ స్త్రీలు తమ జన్మలో ఏనాడైనా గుడిమెట్లు తొక్కారా? వాళ్ళతో కోలాటాలు ఆడించి మూర్ఖిస్టులు ఏమి సాధిద్దామని?
కమ్యూనిస్టులకు ఎప్పటికీ బుద్ధి రాదు. ఇవాళ నామావశిష్టమై ఇతర పార్టీల మోచేతి నీళ్ళు తాగుతూ నాలుగైదు సీట్లు బిచ్చమెత్తుకునే దుర్గతికి చేరినా వాళ్ళ నీచబుద్ది మారదు. ఎందుకంటే, భారతదేశాన్ని సంఘటితంగా ఉంచుతున్నది కేవలం హిందూ మతమే అని వాళ్ళకు తెలుసు. ఇదే దేశంలో అన్యమతాలు ప్రబలంగా ఉన్నచోట్ల వేర్పాటువాదమూ హింసా పెచ్చరిల్లిపోతున్న సంగతి మనతో పాటు విదేశీ భక్త కమ్మీలకు కూడా తెలుసు. వారికి అంతిమంగా కావల్సినది హిందుమత వినాశనం, తద్వారా దేశ నాశనం, తద్వారా తమ యాజమాన్య దేశానికి ప్రయోజనం.
కులం కోసం చొక్కాలు చింపుకుంటూ మతం విషయం లో నిర్లిప్తంగా ఉండే మన హిందువులు ఏనాటికీ కళ్ళు తెరవరు అనే కమ్మీల-మిషనరీల-జిహాదీల నమ్మకాన్ని హిందువులు వమ్ము చేయడం చారిత్రక అవసరం.