మహిళల క్రికెట్ పోటీలో భాగంగా భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. రాజ్‌కోట్ నిరంజన్ షా మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 435 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ చేయగల్గింది. ప్రతికా రావల్ 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు చేసింది. ప్రతిగా ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. స్మృతీ మంధాన 80 బంతుల్లో 130 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. రిచా ఘోష్ (59) కూడా అద్భుతంగా ఆడింది.
తేజల్(28 ), హర్లీన్( 15) పరుగులు చేశారు. మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజులో జెమీమా రోడ్రిగ్స్( 4), దీప్తి శర్మ(11) ఉన్నారు.
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసి ఐర్లాండ్ ముందు 436 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా రెండు వికెట్లు తీయగా, కెల్లీ, ఫ్రేయా సర్జెంట్, జార్జియానా తలా ఒక వికెట్ తీశారు. భారత్ ఇప్పటికే 2-0 తేడాతో ఈ సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది.