మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 18న కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి కళ్యాణోత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు.
త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో శ్రీవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. అర్చక స్వాములు శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం తిరుప్పావై సేవ, తోమాలసేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. అనంతర భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు స్వామివారిని 7,083 మంది భక్తులు దర్శించుకుని అనుగ్రహం పొందారు.
భక్తులు విరాళాలు సమర్పించేందుకు వీలుగా టీటీడీ కీయోస్క్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూ.1 నుంచి రూ.99,999 వరకు తమకు స్వామి వారికి విరాళంగా ఇవ్వవచ్చు.