సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీకి కొనసాగింపుగా జైలర్ -2 తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసింది. జైలర్ మూవీని ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. జైలర్ సీక్వెల్ టీజర్ లో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కనిపించారు.